ఈ రోజుతో రాంబాబు డబ్బింగ్ పూర్తి

ఈ రోజుతో రాంబాబు డబ్బింగ్ పూర్తి

Published on Oct 10, 2012 8:18 AM IST


కెమెరామెన్ గంగతో రాంబాబు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఒక వైపు సినిమా ఫైనల్ మిక్సింగ్లో ఉండగా, రెండు రోజులు రాత్రిళ్ళు కూడా డబ్బింగ్ చెప్పిన రాంబాబు ఈ రోజుతో డబ్బింగ్ అంతా పూర్తి కానుంది. ఇప్పటికే డబ్బింగ్ అంతా పూర్తయింది కాని మైనర్ కరెక్షన్స్ కోసం ఈ రోజు పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పనున్నారు. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఈ వారాంతంలో సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుని అక్టోబర్ 18 న సినిమాని విడుదల చేయనున్నారు. చిత్ర దర్శకుడు పూరి జగన్నాధ్ మరియు చిత్ర నిర్మాతలు డివివి దానయ్య, రాధాకృష్ణ సినిమా అవుట్ పుట్ పై చాలా సంతోషంగా ఉన్నారు. గబ్బర్ సింగ్ ని మించి పెద్ద హిట్ అవుతుందన్న నమ్మకంతో వారు ఉన్నారు.

తాజా వార్తలు