పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సమంత తమ తదుపరి సినిమా ‘అత్తారింటికి దారేది’ చిత్రీకరణ కోసం జూన్ లో యూరోప్ వెళ్లనున్నారు. కొన్ని పాటలలో బిట్లతో పాటు అక్కడ వీరిద్దరి మధ్యా ఒక డ్యూయెట్ కుడా తియ్యనున్నారు. ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు.
ఇందులో రెండో హీరొయిన్ గా ప్రణీత సుబాష్ నటిస్తుంది. హిందీ నటుడు బోమన్ ఇరానీ, నాదియా ముఖ్యపాత్రాలలో కనిపించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
‘అత్తారింటికి దారేది’ సినిమా ఆగష్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఇంతకు ముందు పవన్- త్రివిక్రమ్ కలిసి మనకు అందించిన ‘జల్సా’ లాగే ఈ సినిమా కూడా మంచి విజయం సాదించాలని ఆశిద్దాం.