గత సంవత్సరం వచ్చిన ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో డైరెక్టర్ పవన్ సాధినేని ఏ సెంటర్, మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అతని రెండవ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం పవన్ సాధినేని తన రెండవ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేయనున్నాడు. కథా చర్చలు కూడా ముగిసాయి.
అన్నీ కుదిరితే అల్లు హీరోల్లో ఒకరు ఈ సినిమాలో నటించే అవకాశం ఉంది, కానీ ప్రస్తుతానికయితే ఆ విషయంలో ఎలాంటి కచ్చితమైన వార్తలు లేవు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రేమ ఇష్క్ కాదల్ కి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ కార్తీక్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ లు ఈ సినిమాకి కూడా పనిచేయనున్నారు.