నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఎందరో సినీ తారల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దీనిలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా తనకు విష్ చేసిన ప్రతీ ఒక్కరికీ పవన్ రిప్లై ఇచ్చారు. అలా రిప్లై అందుకున్న వారిలో తన బిగ్గెస్ట్ హిట్ “అత్తారింటికి దారేది”లో పవన్ తో చిన్న ఫ్రేమ్ లో కనిపించిన ఇప్పటి హీరో సత్యదేవ్ కూడా ఒకరు.
అయితే ఈ మోస్ట్ టాలెంటెడ్ హీరో నటించిన లేటెస్ట్ చిత్రం “ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య” నేరుగా ఓటిటిలో విడుదలయ్యి ఎంత మంచి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. మరి ఈ లాక్ డౌన్ లో పవన్ ఈ సినిమాను వీక్షించినట్టు తెలిపారు. సత్యదేవ్ కు రిప్లై ఇస్తూ తన ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య లో మీ పెర్ఫామెన్స్ ను ఎంజాయ్ చేసానని తెలిపారు.
దీనితో సత్యదేవ్ పట్టరాని ఆనందంతో అందుకు ధన్యవాదాలు తెలిపి మీ పుట్టినరోజు నాడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ను తమ టీం తో పంచుకుంటానని తెలిపారు. సో ఈ లాక్ డౌన్ లో పవన్ కూడా కొన్ని సినిమాలు చూస్తున్నారన్నమాట. ప్రస్తుతం పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ టీజర్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది.
@Shobu_ @mahaisnotanoun @paruchurimd @arkamediaworks
— Satya Dev (@ActorSatyaDev) September 2, 2020