పవన్ సినిమాలో ఆ హీరో నటించడం లేదట.

పవన్ సినిమాలో ఆ హీరో నటించడం లేదట.

Published on May 2, 2020 6:06 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ తరువాత మూడు చిత్రాలు వరుసగా ప్రకటించారు. వాటిలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ మూవీ ఒకటి. ఈ మూవీకి విరూపాక్ష అనే టైటిల్ ప్రచారంలో ఉండగా పవన్ బందిపోటు పాత్రలో కనిపించనున్నాడు. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. కాగా కొన్ని రోజులుగా ఈ చిత్రంలో తమిళ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్నారంటూ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.

ఐతే శివకార్తికేయన్ ఈ మూవీలో నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని చిత్ర యూనిట్ తెలియజేశారు. శివ కార్తికేయన్ ఈ మూవీలో నటిస్తున్నాడు అనేది పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేశారు. సీనియర్ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ లాక్ డౌన్ కారణంగా స్వల్ప విరామానికి గురైంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు