మహేష్, పవన్, ప్రభాస్, ఎన్టీఆర్లే నన్ను సపోర్ట్ చేశారు.. దిల్ రాజు హాట్ కామెంట్స్

మహేష్, పవన్, ప్రభాస్, ఎన్టీఆర్లే నన్ను సపోర్ట్ చేశారు.. దిల్ రాజు హాట్ కామెంట్స్

Published on Jun 12, 2025 8:00 AM IST

మన తెలుగు సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ నిర్మాతల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా అలాగే డిస్ట్రిబ్యూటర్ గా కూడా పేరున్న నిర్మాత దిల్ రాజు కూడా ఒకరు. మరి తన నుంచి ఇప్పుడు రాబోతున్న అవైటెడ్ సినిమానే “తమ్ముడు”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ తో నితిన్ హీరోగా దర్శకుడు వేణు శ్రీరామ్ కలయికలో చేసిన ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ఇప్పుడు అందరికీ ఆకట్టుకుంటుంది.

అయితే ఈ ట్రైలర్ లాంఛ్ లో దిల్ రాజు చేసిన కొన్ని హాట్ కామెంట్స్ వైరల్ గా మారాయి. తాను ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన స్టార్ హీరోలే వెన్ను తట్టి సపోర్ట్ అందించారని తెలిపారు. బృందావనం సమయంలో ఎన్టీఆర్ కానీ మిస్టర్ పర్ఫెక్ట్ సమయంలో ప్రభాస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సమయంలో మహేష్ గాని అలాగే వకీల్ సాబ్ సమయంలో పవన్ కళ్యాణ్ గారు కానీ వీరే ఎంతో సపోర్ట్ చేసారని. కేవలం సినిమా చేయడమే కాకుండా పరిస్థితి ఏంటి అనేవి కూర్చొని మాట్లాడి అన్ని విధాలుగా సహకారం అందించారు అన్నట్టు తెలిపారు. దీనితో తన కామెంట్స్ వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు