పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ‘బసంతి’ ఆడియో లాంచ్

పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ‘బసంతి’ ఆడియో లాంచ్

Published on Feb 6, 2014 4:59 PM IST

pawan_basanthi
టాలీవుడ్ కామెడీ కింగ్ బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా నటించిన సినిమా ‘బసంతి’. సున్నితమైన ప్రేమకథకి టెర్రరిజంకి లింక్ పెట్టి చేసిన ఈ సినిమాకి చైతన్య దంతులూరి(బాణం ఫేం) డైరెక్టర్. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాకి ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి.

ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేసారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమాలోని ‘ప్రతి క్షణం’ అనే మెలోడీ సాంగ్ టీజర్ ని యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా లాంచ్ చేసారు. ఇక చివరిగా ఈ ఆదివారం అనగా ఫిబ్రవరి 9న ఆడియోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంచ్ చేయనున్నారు.

గౌతమ్ సరసన అలీషా బైగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు