పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి చాలా కాలం తర్వాత ఓ సినిమా అందులోని స్ట్రెయిట్ సినిమా ఇప్పుడు రాబోతుంది. ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి వస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు ట్రైలర్ విషయంలో లాస్ట్ మినిట్ లో పవన్ తన మార్క్ మార్పులు చేర్పులు చేసారు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ నుంచి రానున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “ఓజి”.
దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. అయితే లేటెస్ట్ గా పవన్ ఫస్టాఫ్ వరకు చూసినట్టు తెలుస్తోంది. కానీ పవన్ ఈ ఫస్టాఫ్ చూసి కొన్ని మార్పులు సూచించినట్టు టాక్ వినిపిస్తోంది. సో మిగతా అంతా పవన్ కి నచ్చినట్టే అనుకోవచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.