ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ : జూలై 4, 2025
స్ట్రీమింగ్ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : సుహాస్ పాగోలు, కీర్తి సురేష్, బాబు మోహన్, శత్రు, తాళ్లూరి రామేశ్వరి, శుభలేఖ సుధాకర్, రవితేజ, విష్ణు O.I, దువ్వాసి మోహన్, శివన్నారాయణ, ప్రభావతి వర్మ
దర్శకత్వం : అని I.V.శశి
నిర్మాతలు : రాధిక లవు
సినిమాటోగ్రఫీ : దివాకర్ మణి
సంగీతం : స్వీకర్ అగస్తి
ఎడిటర్ : శ్రీజిత్ సారంగ్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం ఓటిటిలో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో నేరుగా డిజిటల్ గానే రిలీజ్ కి వచ్చిన చిత్రం ‘ఉప్పు కప్పురంబు’. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ అలాగే టాలెంటెడ్ నటుడు సుహాస్ కలయికలో తెరకెక్కిన కామెడీ డ్రామా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
1990 సమయంలో ఒక వింతైన ఊరు చిట్టి జయపురం అక్కడ అపర్ణ (కీర్తి సురేష్) అనే అమ్మాయి ఆ ఊరికి ప్రెసిడెంట్ గా కొన్ని కారణాలు రీత్యా ఎంపిక అవుతుంది. అయితే తన పాత్ర కోసం కొంచెం కూడా తెలియని అపర్ణ ఆ ఊరి పెద్దలు, ప్రజలతో అవస్థలు పడుతూ ఉంటుంది. ఇంకోపక్క చిన్నా (సుహాస్) ఆ ఊరి కాటి కాపరిగా పని చేస్తుంటాడు. ఈ సమయంలో ఆ ఊరి కాష్టం విషయంలో ఒక చిక్కు వచ్చి పడుతుంది. ఆ ఊరు స్మశానంలో కేవలం నలుగురికి సరిపడా చోటు మిగిలి ఉంటుంది. దీనితో ఆ ఊరు ప్రజలు ఆ నాలుగు చోట్లలో తమకే ఓ చోటు కావాలని కంగారు పడతారు. చిన్నా తల్లి కూడా కాన్సర్ కారణంగా ఆమెకి కూడా మరణం దగ్గరే ఉంటుంది. ఇలాంటి సమయంలో అపర్ణ ఏం చేసింది? ఇందులో చిన్నా ఎలా సహకరిస్తాడు? తన తల్లి చివరి కోరిక తీర్చాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.
ప్లస్ పాయింట్స్:
మొదటిగా ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యునిక్ పాయింట్ ని ఎంచుకున్న దర్శకున్ని మెచ్చుకోవాల్సిందే. ఈ తరహా సున్నితమైన కాన్సెప్ట్ ని ఆవిష్కరించడం అనేది అంత సులువేం కాదు. ఇక నటీనటుల్లో సుహాస్ మరోసారి తన మార్క్ సహజమైన నటనతో షైన్ అయ్యాడు. ఒక కాటి కాపరిగా, నవ్విస్తూనే తన మార్క్ ఎమోషనల్ పెర్ఫామెన్స్ ని కూడా చేసి కదిలిస్తాడు.
ఇక ఇది కీర్తి సురేష్ నుంచి కంప్లీట్ గా ఒక కొత్త వెర్షన్ అని చెప్పవచ్చు. ఇది వరకు కీర్తి చాలా విలేజ్ అమ్మాయిల పాత్రలు చేసింది. మహానటిలో తన కెరీర్ బిగినింగ్ సమయంలో చూపించే క్యూట్ అండ్ అమాయకత్వం పెర్ఫామెన్స్ కి ఇది ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉంటుంది.
ఇందులో తన లుక్ సహా నటన మరింత ఇంపుగా సహజంగా కనిపిస్తాయి. తన పాత్ర ప్రవర్తన, కన్ఫ్యూజన్ అందులో కామెడి భలే అనిపిస్తాయి. ఇక సీనియర్ నటుడు బాబు మోహన్ కూడా చాన్నాళ్ల తర్వాత కనిపించి ఆకట్టుకున్నారు. శత్రు, మధుబాబు తదితరులు మంచి పెర్ఫామెన్స్ లు అందించారు. అలాగే తాళ్లూరి రామేశ్వరి చిన్న పాత్రలోనే కనిపించినా మంచి ఇంపాక్ట్ ని చూపించారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో లైన్ బానే ఉన్నప్పటికీ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. ఇలాంటి కాన్సెప్ట్ మీద కూడా సినిమా చేయొచ్చా అని కొందరు అనుకోవచ్చు, ఇలాంటి కాన్సెప్ట్ లతో ఎవరైనా సినిమా చేస్తారా ఇంకొందరు నెగిటివ్ గా అనుకోవచ్చు. సో ఆ ఛాన్స్ ఈ సినిమాపై ఉంది. ఇక కథనం కూడా ఇంకొంచెం బెటర్ గా ప్లాన్ చేయాల్సింది.
ముఖ్యంగా ఫస్టాఫ్ లో చాలా వరకు సన్నివేశాలు ఇంకా బెటర్ గా చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని అనవసర సన్నివేశాలు తగ్గించి ఉంటే ఫ్లో ఇంకొంచెం బెటర్ గా సాగి ఉండేది. అలాగే కీర్తి సురేష్ తన రోల్ లో బాగానే చేసింది కానీ కొన్ని సన్నివేశాల్లో మాత్రం కొంచెం ఓవర్ గా అనిపిస్తుంది.
ఇంకా బెటర్ గా తన రోల్ డిజైన్ చేయాల్సింది. తాళ్లూరి రామేశ్వరి పాత్ర కూడా ఇంతే తన రోల్ మంచి ఇంపాక్ట్ కలిగించేలా అనిపిస్తుంది కానీ ఎక్కడో కంప్లీట్ గా అనిపించదు. ఇంకా ఆమె పాత్రలో ఎమోషనల్ డెప్త్ ని యాడ్ చేయాల్సింది. ఇంకా చాలా పాత్రలు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కథనంలో అనవసరంగా చేర్చినట్టు అనిపిస్తుంది. వీటితో అక్కడక్కడా బోర్ కూడా కలుగక మానదు.
సాంకేతిక వర్గం:
సినిమాలో నిర్మాణ విలువలు కానీ ప్రొడక్షన్ డిజైన్ గాని బాగున్నాయి. నాచురల్ అట్మాస్పియర్ ని చూపించారు. అలాగే సంగీతం బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది. సినిమాటోగ్రఫీ కూడా మరో ఆకర్షణ అని చెప్పవచ్చు.
ఇక దర్శకుడు అని ఐ వి శశి విషయానికి వస్తే.. తాను మంచి కథనే పట్టుకున్నారు అలాగే చాలా వరకు ఎంగేజ్ చేసే ప్రయత్నమే చేశారు. కానీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం అదే ఫ్లోని కంటిన్యూ చేసి ఉంటే ఉప్పు కప్పురంబు మరింత ఎంటర్టైనింగ్ గా అనిపించి ఉండేది. ఇంకొంచెం గ్రౌండ్ వర్క్ తాను చేసి ఉంటే బాగుండేది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే.. ఈ ‘ఉప్పు కప్పురంబు’ ఒక సింపుల్ కామెడీ ఎమోషనల్ డ్రామా అని చెప్పవచ్చు. కీర్తి సురేష్మ్ సుహాస్ లు తమ నటనతో మెస్మరైజ్ చేస్తారు. అలాగే కాన్సెప్ట్ కూడా బానే ఉంది కానీ మేజర్ ఆఫ్ ఆడియెన్స్ కి ఇది కనెక్ట్ అవుతుంది. కాకపోతే కొన్ని మూమెంట్స్ మాత్రం సినిమాలో డల్ గా అనిపిస్తాయి. సో వీటిని పక్కన పెడితే ఈ వీకెండ్ కి తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే ఓటిటిలో ఈ చిత్రం ఓకే అనిపిస్తుంది.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team