రామోజీ ఫిలింసిటీలో పవన్ కళ్యాణ్ ,త్రివిక్రమ్ ల చిత్రం షూటింగ్

రామోజీ ఫిలింసిటీలో పవన్ కళ్యాణ్ ,త్రివిక్రమ్ ల చిత్రం షూటింగ్

Published on Apr 2, 2013 4:50 AM IST

pawan-kalyan-trivikram
పవన్ కళ్యాణ్ ,త్రివిక్రమ్ ల తాజా చిత్రం యొక్క ప్రధాన షూటింగ్ భాగం గత కొన్ని రోజులుగా రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కి జంటగా సమంత నటిస్తున్న ఈ చిత్రం లో ప్రణీత సుభాష్ మరో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది . ఇటివలే కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్ని ప్రణీత ,బ్రహ్మాజీ ,రఘుబాబుల పై చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ ఇంకొన్ని రోజులు హైదరాబాద్లో కొనసాగుతుంది. గతంలో పొల్లాచిలో కొంత భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం యొక్క తర్వాతి షెడ్యూల్ బార్సిలోనలో జరగనుందని సామాచారం. ఈ కుటుంబ కథ చిత్రం లో పవన్ కళ్యాణ్ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నారని వినికడి . బోమన్ ఇరానీ, నదియా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సరదా’ అనే పేరు పరిశీలనలో వుంది. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.

తాజా వార్తలు