పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రేయ్ ఆడియో

పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రేయ్ ఆడియో

Published on Jan 17, 2014 8:00 AM IST

pawan_kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ రోజు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రేయ్’ సినిమా ఆడియో విడుదల కానుంది. ఈ వేడుక హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరగనుంది. దీనికి సంబందించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. చక్రి ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసాడు. వైవిఎస్ చౌదరి ఈ సినిమాకి దర్శకుడు మరియు నిర్మాత.

అలాగే సినిమాని ఫిబ్రవరి 5న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు. చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాలో సయామీ ఖేర్, శ్రద్దా దాస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలోని ఎక్కువ భాగాన్ని యుఎస్, కరేబియన్ దీవుల్లో షూట్ చేస్తున్నారు.

తాజా వార్తలు