బన్నీ, చరణ్ తో పాటుగా వారికి పవన్ స్పెషల్ థాంక్స్.!

మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కోసం అని చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రాంతంలో పవన్ కోసం ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ ఘాతానికి గురయ్యి ముగ్గురు అభిమానులు చనిపోయిన వార్త ఇతర పవన్ మరియు సినీ వర్గాలను విష్మయానికి గురి చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ఘటన నిమిత్తం బాధిత కుటుంబాలకు గాను అండగా ఉంటామని పవన్ సినిమాలు చేస్తున్న పలు నిర్మాణ సంస్థలు సహా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు తమ వంతు ఆర్ధిక సాయంతో ముందుకొచ్చారు. దీనితో పవన్ వారికి ముందు గానే ఒకసారి ధన్యవాదాలు తెలిపారు.

ఇపుడు మరోసారి వారందరికీ కలిపి ప్రత్యేక కృతజ్ఞ్యతలు తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. “కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన శ్రీ రాంచరణ్ కి, అలాగే పెద్దమనుసు తో ముందుకు వచ్చిన శ్రీ అల్లు అర్జున్ కి, నిర్మాతలు శ్రీ దిల్ రాజు, శ్రీ ఏ.ఎమ్ రత్నం, మైత్రి మూవీస్ శ్రీ నవీన్ గార్లకు,నా కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేసారు.

Exit mobile version