మోస్ట్ అవైటెడ్ సినిమాలా మారిన పవన్ రిప్లై.!

మాములుగా మన దగ్గర సినిమా ప్రియులు ఎక్కువ కాబట్టి తాము ఏదైతే సినిమా కోసం ఎక్కువగా ఎదురు చూస్తారో దానిని మోస్ట్ అవైటెడ్ సినిమా జాబితాలోకి చేరుస్తారు. ఇపుడు అంతకంటే ఎక్కువ మోస్ట్ అవైటెడ్ గా పవన్ స్పందన మారింది. అందుకు బలమైన కారణం కూడా లేకపోలేదు. నిన్న పవన్ పుట్టినరోజు సందర్భంగా ఎందరో సినీ తారలు శుభాకాంక్షలు తెలిపారు.

కానీ ఒక్క సూపర్ స్టార్ మహేష్ తెలిపిన విషెస్ మాత్రం చాలా స్పెషల్ గా మొత్తం సినీ ఇండస్ట్రీ వర్గాల వారికి అనిపించాయి. అలాగే మహేష్ నుంచి చాలా ఏళ్ల తర్వాత ఇలా పవన్ కోసం ఒక ట్వీట్ రావడంతో ఇద్దరి హీరోల అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇక్కడే అసలైన ప్రశ్న మరొకటి మొదలయ్యింది. మహేష్ చెప్పారు సరే పవన్ అందుకు రిప్లై ఇస్తారో లేదో అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న గా ఇద్దరి హీరోల అభిమానుల్లో మెదిలింది.

దీనితో ఇవ్వబోయే రిప్లై కాస్తా మంచి మోస్ట్ అవైటెడ్ గా మారిపోయింది. అలా వారు ఎంత గానో ఎదురు చూస్తున్న తరుణంలో పవన్ నుంచి మహేష్ ట్వీట్ కు రిప్లై రావడంతో ఒక్కసారిగా ఆ సస్పెన్స్ కు తెర పడ్డట్టు అయ్యింది. అయితే పవన్ సినీ రంగం నుంచి శుభాకాంక్షలు తెలిపిన వారికి రిప్లైస్ రూపం లోను రాజకీయం నుంచి తెలిపిన వారికి ట్వీట్ రూపంలోనూ తన స్పందనను తెలపడం విశేషం. ఇక ఎలాగో మొత్తం పవన్ నుంచి నాలుగు సినిమాలు అనౌన్స్ చెయ్యడంతో ఈ సూపర్ కిక్ తో పాటు దానిని కూడా ఎంజాయ్ చేస్తున్నారు.

Exit mobile version