పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పవన్ పాత్ర అల్టిమేట్‌గా ఉండనుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రేక్షకుల్లో ఈ మూవీపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ చేశాయి.
ఇక రీసెంట్‌గా ఈ చిత్రం నుంచి వచ్చిన ‘మాట వినాలి’ పాట ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ఈ పాటను పవన్ స్వయంగా పాడారు. అయితే, ఈ పాటకు లిరిక్స్ రాసిన ప్రముఖ సింగర్ పెంచల్ దాస్, తొలుత తానే ఈ పాటను పాడాలని అనుకున్నారట. అయితే, పవన్ కళ్యాణ్‌కు ఈ పాట నచ్చడంతో ఆయనే స్వయంగా పాడతానని చెప్పారట.
దీంతో ‘మాట వినాలి’ అంటూ పవన్ పాడిన పాట మన ముందుకు రావడం.. అది చార్ట్‌బస్టర్‌గా మారడం జరిగిపోయింది. ఇక ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.