శ్రియ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘పవిత్ర’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో స్త్రీలకు న్యాయం జరగాలి అని వారి హక్కుల కోసం పోరాడుతూ పొలిటీషియన్ అయ్యే పాత్రలో శ్రియ కనిపించనుంది. జనార్ధన్ మహర్షి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రియ మీద వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను ఈ రోజు హైదరాబాద్ యూసఫ్ గూడాలోని కృష్ణ కాంత్ పార్క్ లో షూట్ చేసారు. సాయి కుమార్, రోజా, ఎ.వి.ఎస్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి వి.ఎన్ సురేష్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా, ఎం.ఎం శ్రీ లేఖ సంగీతం అందిస్తోంది. ఆదేశ్ ఫిల్మ్స్ బ్యానర్ పై కె. సాధాక్ కుమార్ – జి. మహేశ్వర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కాకుండా శ్రియ, సిద్దార్థ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘మిడ్ నైట్ చిల్డ్రన్’ సినిమా ఫిబ్రవరి 1న ఇండియాలో రిలీజ్ కానుంది. దీప మెహతా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సల్మాన్ రుష్దీ రాసిన నవలా ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలోని మూడు కీలక పాత్రల్లో రెండు పాత్రలు పోషించిన శ్రియ, సిద్దార్థ్ పైనే అందరి చూపు.