జూన్ 7న పోటీకి సిద్దమవుతున్న పవిత్ర

జూన్ 7న పోటీకి సిద్దమవుతున్న పవిత్ర

Published on May 26, 2013 5:30 PM IST

Pavitra (8)
ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వారల ప్రకారం అందాల భామ శ్రియ ప్రధాన పాత్రలో నటించిన ‘పవిత్ర’ సినిమా చివరికి జూన్ 7 న రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. జనార్ధన్ మహర్షి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సాధక్ కుమార్ – సాయి మహేష్ రెడ్డి నిర్మించారు. ముందుగా ఈ సినిమాని మేలో రిలీజ్ చేయ్యాలనుకున్నారు కానీ ఈ చిత్ర నిర్మాతలు తెలుగు, తమిళం, మలయాళంలో ఒకే సారి రిలీజ్ చెయ్యాలనే ఉద్దేశంతో జూన్ కి పోస్ట్ పోన్ చేసారు. తమిళ్లో ఈ సినిమాకి ‘పేరు మాట్రుందాన్ పవిత్ర; అనే టైటిల్ ని పెట్టారు.

జన్ర్ధాన్ మహర్షి మాట్లాడుతూ ‘ ఈ సినిమాలో శ్రియ వేశ్య పాత్ర చేస్తోంది. కానీ మిగతా సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా థీం లైన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పవిత్ర సినిమాని ఒక నిజ జీవిత సంఘటన ఆశారంగా తీసాం. ఒక లేడీ ఎంతో ఫైట్ చేసి ఒక పొలిటీషియన్ ఎలా అయ్యింది అనేదే ఈ సినిమా కథ అని’ అన్నాడు. ఈ సినిమా శ్రియ తెలుగులో చేసిన తొలి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. శ్రియ చివరిగా శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన ‘లైఫ్ ఈస్ బ్యూటిఫుల్’ సినిమాలో కనిపించింది. అలాగే త్వరలో విక్రం కుమార్ డైరెక్షన్లో సెట్స్ పైకి వెళ్లనున్న ‘మనం’ సినిమాలో నాగార్జున సరసన జోడీ కట్టనుంది.

తాజా వార్తలు