పొల్లాచిలో పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ సినిమా

pavan-trivikram

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వీరి కామినేషణ్ లో వచ్చిన ‘జల్సా’ సినిమాకు మంచి ఆదరణ లబించిన విషయం మనకు తెలుసు. ఇప్పుడు మళ్లి వీరిద్దరూ మరో సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా తమిళనాడులోని పొల్లాచిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలోని కొన్ని ముఖ్యమైన కార్ చేజింగ్, పైట్స్ సన్నివేశాలను పైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఆద్వర్యంలో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో సమంత, ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర సిని చిత్ర ఇండియా పై. లి. సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకి బీ. వి.ఎస్. ఎన్. ప్రసాద్ నిర్మాత. బోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్లు సహా నిర్మాతలు గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Exit mobile version