పార్క్ హయ్యత్ – టాలీవుడ్ స్టార్స్ కొత్త అడ్డా

పార్క్ హయ్యత్ – టాలీవుడ్ స్టార్స్ కొత్త అడ్డా

Published on Nov 20, 2012 3:42 PM IST


ఎంతో ప్రతిష్టాత్మకమైన మరియు విలాసానికి బాగా వీలైన హైదరాబాద్లోని పార్క్ హయ్యత్ హోటల్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖులకు అడ్డాగా మారింది. ఈ హోటల్లో రెగ్యులర్ రూమ్స్ మరియు సర్వీస్ అపార్ట్ మెంట్స్ కూడా ఉన్నాయి. సర్వీస్ అపార్ట్ మెంట్స్ టాలీవుడ్ వారిని బాగా ఆకట్టుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్, సమంత మరియు డైరెక్టర్ పూరి జగన్నాథ్ లు ఇప్పటికే ఇక్కడ అపార్ట్ మెంట్స్ తీసుకున్నారు మరియు వీటి కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ తన సినిమాకి సంబందించిన కథా చర్చలన్నీ అక్కడే జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ అన్ని వసతులు ఉంటాయి, అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉంటుంది.

ఇంకా చాలా మంది టాప్ హీరోలు మరియు హీరోయిన్స్ వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ హోటల్లో ఉండటానికి మరియు వాళ్ళ ఫుడ్ కి కలిపి ఒక నెలకే కొన్ని లక్షలు ఖర్చవుతుంది. అక్కడ ప్రశాంతత మరియు నెం.1 సర్వీసింగ్ దొరుకుతూ ఉండడం వల్ల ఇండస్ట్రీలోని చాలా మంది అదేమీ పెద్ద కాస్ట్ కాదని అంటున్నారు.

తాజా వార్తలు