చిరు 150వ సినిమాకు ముంబై హీరోయిన్?

చిరు 150వ సినిమాకు ముంబై హీరోయిన్?

Published on Jan 31, 2014 2:02 AM IST

chiru_praneethi_chopra
చిరంజీవి 150వ సినిమా దాదాపు ఖరారయినట్లే అనే సూచనలు కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ వార్తపై ఎవరి అభిప్రాయంతో వారు కధనాలు రాసుకుంటున్నారు. డిసెంబర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో త్వరలో నటిస్తానని ఆయనే స్వయంగా చెప్పారు

ఈ సినిమాకు దర్శకుడు ఎవరో ఇంకా ప్రకటించకపోయినా అగ్ర హీరోయిన్లను సంప్రదించారని సమాచారం. ముంబైలో ఒక ప్రముఖ కధనం ప్రకారం ఈ సినిమాకు పరిణీతి చోప్రాను ఎంచుకున్నారట. ఈ భామ ఇష్క్ జాదే సినిమాలో కనిపించింది. హిందీ సినిమాల షూట్ కోసం హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఈ సినిమా కధ కూడా చెప్పారని కానీ డేట్ లు సర్దుబాటు కాక ఈ అవకాశాన్ని వదులుకుందని తెలిపారు

త్వరలో చిరు 150వ సినిమాపై నీలిమేఘాలు తొలిగిపోతాయి. మెగాస్టార్ చివరిసారిగా మగధీర సినిమాలో తళుక్కున మెరిశారు. ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం 2007 లో విడుదలైన శంకర్ దాదా జిందాబాద్

తాజా వార్తలు