పరుశురామ్ మహేష్ సినిమా కోసం.. ?

పరుశురామ్ మహేష్ సినిమా కోసం.. ?

Published on Mar 10, 2020 6:43 PM IST

‘గీత గోవిందం’తో భారీ విజయాన్ని నమోదు చేశాక కూడా పరుశురామ్ తన తరువాత సినిమా కోసం చాల టైం తీసుకున్నాడు. అయితే అంత టైం తీసుకున్నందుకు పరుశురామ్ కి భారీ ఆఫరే దక్కింది. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేసే ఛాన్స్ ను కొట్టేశాడు. కాగా ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ చిత్రాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదిలావుండగా, పరశురామ్ ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయానికి షిఫ్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన అక్కడి నుండే తన టీమ్ తో సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను చేస్తున్నారు.

అన్నట్టు మహేష్ – పరుశురామ్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి ఏర్పడింది. ఇక చాలా టైం తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకున్న పరుశురామ్, మహేష్ బాబు కోసం ఎమోషనల్ గా సాగే ఒక కమర్షియల్ ఎంటర్ టైనర్ ను సిద్ధం చేస్తున్నాడట. అన్ని కుదిరితే త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు. అలాగే వంశీ పైడిపల్లితో చేయాలనుకున్న సినిమాను కూడా మహేష్ లైన్ లో పెట్టారని.. కాకపోతే అది వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

తాజా వార్తలు