రాజమౌళి, గౌతం మీనన్ లాంటి అగ్ర దర్శకులతో జతకట్టిన తరువాత, నానీని త్వరలో కృష్ణ వంశీ ‘పైసా’ చిత్రంలో చూడనున్నం. ఈ సినిమా చాలా భాగం ఇప్పటికే పూర్తయింది. నాని టైటిల్ సాంగ్ చిత్రీకరణకి మలేసియా వెళ్ళాడు. నివేదికల ప్రకారం ఈ పాట పబ్ లో చాలా మంది విదేశీ అమ్మాయిల మధ్య చిత్రీకరించారు. ” ‘పైసా’ టైటిల్ సాంగ్ పూర్తయింది. ఇండియాకి తిరిగి వచ్చేస్తున్నాం…. నేను వెయిట్ చెయ్యలేకపోతున్నా ” అని షూటింగ్ పూర్తయిన వెంటనే ట్వీట్ చేసాడు. ‘పైసా’ 1st లుక్ ఫిబ్రవరి 24న విడుదల కానుంది. రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కేథరినే త్రెస నానీకి జంటగా నటించింది. ‘పైసా’ సినిమా రాజకీయ నేపధ్యంలో తెరకెక్కనుంది. మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడించనున్నారు.