పూర్తయిన పైసా షూటింగ్

పూర్తయిన పైసా షూటింగ్

Published on Apr 5, 2013 7:08 PM IST

Paisa

కృష్ణ వంశీ దర్శకత్వంలో నాని నటిస్తున్న ‘పైసా’ షూటింగ్ పూర్తయింది . ఈ సినిమాని రమేష్ పుప్పాల యెల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్లో ఒక పాటని మరియు హీరో ఇంట్రడక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. దీంతో ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయింది. “పైసా లో ఆఖరి రోజు. మరిచిపోలేని ప్రయాణం.. అతను తిరిగి వచ్చాడు… ఒక హిట్ తో” అని నాని, కృష్ణ వంశీ గురించి ‘పైసా’ గురించి ట్వీట్ చేసాడు. కాథారినే త్రెస, సిద్ధిక శర్మ హీరోయిన్స్. చరణ్ రాజ్ విలన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా ఆడియో ఏప్రిల్ 11న విడుదల కానుంది. వేసవి చివర్లో సినిమా విడుదల అవుతుంది. ‘పైసా’ మన రాష్ట్ర రాజకీయాల నేపధ్యాల నడుమ తీసిన ఒక పొలిటికల్ డ్రామా.

తాజా వార్తలు