సినిమా ఇండస్ట్రిలీ పైరసీ పెద్ద భూతంలా పట్టిపీడిస్తుంది. తక్కువ ధరకే హై క్వాలిటీ రికార్డింగ్ పరికరాలు దొరకడం వల్ల దీనికి అడ్డులేకుండా పోతుంది
ఎన్నో కష్టాలను ఎదుర్కుని నిన్న విడుదలైన పైసా సినిమాకు పైరసీ వర్షన్ ను అప్పుడే దింపే పనిలోపడిపోయారు. కాచీగూడ ఐనాక్స్ వద్ద ఒక మనోజ్ కుమార్ అనే వ్యక్తి సోని కెమెరా లో రికార్డు చేస్తుండగా పట్టుకున్నారు
పట్టుకున్న వ్యక్తిని ప్రశ్నించగా పూర్ణ చంద్ర రావు అనే పెద్ద తలకాయ పేరు బయటపెట్టాడు. ఇప్పుడు పోలీసులు అతన్ని వెతికే పనిలో వున్నారు. ఫిలిం ఛాంబర్ మొత్తం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు
మీకు ఇటువంటి పైరసీ డి.వి.డి లు ఆచూకీ తెలిస్తే వెంటనే సంబంధిత అధికారులకుతెలిపి తెలుగు సినిమా ఇండస్ట్రి భవిష్యత్తును కాపాడండి