ఓటీటీలో కూడా ‘ఓజి’ ఊచకోత!

ఓటీటీలో కూడా ‘ఓజి’ ఊచకోత!

Published on Oct 26, 2025 6:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రమే “ఓజి”. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా అభిమానుల అంచనాలు అందుకొని పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే రికార్డ్ గ్రాసర్ గా నిలిచింది. ఇక థియేటర్స్ తర్వాత దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.

ఇలా ఒక్క ఇండియా లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా మొత్తం 8 దేశాల్లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుందట. అలాగే గ్లోబల్ గా టాప్ 10 లో ట్రెండ్ అవుతుంది అని తెలుస్తోంది. ఇలా మొత్తానికి ఓజి మేనియా ఓటీటీ లో కూడా ఓ రేంజ్ లోనే ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

తాజా వార్తలు