కొద్ది రోజుల క్రితం విలక్షణ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి నూతన ప్రతిభ కోసం వెతుకుతున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా నటీనటుల కోసం పిలుపుని కూడా ఇచ్చారు. ఈ పిలుపుకి అనూహ్యాయిన స్పందన వచ్చినట్టు తెలుస్తుంది. మాకు అందిన సమాచారం ప్రకారం రెండు రోజుల్లో దాదాపుగా మూడు వేల అప్లికేషన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ అప్లికేషన్స్ అన్ని చూడటానికి ప్రత్యేకంగా ఒక టీం ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. “బహుబలి” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కథానాయకుడిగా నటించగా రానా దగ్గుబాటి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అర్క మీడియా నిర్మిస్తుంది.