ఓటీటీలో ‘కె-ర్యాంప్’ ర్యాంపేజ్

K Ramp 4

దీపావళి కానుకగా రిలీజ్ అయిన కిరణ్ అబ్బవరం ‘కె-ర్యాంప్’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్‌గా నిలిచింది. ఇక ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా చాలా తక్కువ సమయంలోనే 150 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు నమోదు చేసుకుని సత్తా చాటింది. అభిమానులు సోషల్ మీడియాలో క్లిప్స్, ఎడిట్స్ పంచుకుంటూ సినిమాకు మరింత హైప్ తీసుకువస్తున్నారు.

బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం కిరణ్ అబ్బవరం – ఆహా కాంబినేషన్‌కి మరో హిట్‌గా నిలిచింది. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ నిర్మాణంలో జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది.

థియేటర్లతో పాటు ఓటీటీలోనూ సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా మున్ముందు ఇంకా ఎలాంటి ఫీట్ సాధిస్తుందో చూడాలి.

Exit mobile version