హాలీవుడ్ సహా ప్రపంచ సినిమా ఆడియెన్స్ లో మంచి ఆదరణ ఉన్న సూపర్ హీరో చిత్రాల్లో “సూపర్ మ్యాన్” కూడా ఒకటి. డీసీ కామిక్స్ చెందిన ఈ సూపర్ హీరో నుంచి కాలానుగుణంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. అలానే ఈసారి వచ్చిన కొత్త ఎడిషన్ రీసెంట్ గానే విడుదల అయ్యింది. గత జూలై 11న గ్రాండ్ గా విడుదల అయ్యిన సూపర్ మ్యాన్ చిత్రం ఈ నెల పూర్తి చేసుకొని అప్పుడే ఓటిటిలోకి వచ్చేస్తుంది.
అయితే ఈ సినిమా ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ అలాగే ఫండగో లాంటి ఓటిటి యాప్స్ లో ఈ ఆగస్ట్ 15 నుంచి అందుబాటులోకి రాబోతుంది. కానీ ఇది రెంటల్ గా మాత్రమే అందుబాటులో ఈ డేట్ నుంచి రానుంది. సో సబ్ స్క్రిప్షన్ ఉన్నప్పటికీ మళ్ళీ అదనంగా కొంతమొత్తం చెల్లించి కొత్త సూపర్ మ్యాన్ సాహసాలు ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమాలో సూపర్ మ్యాన్ గా డేవిడ్ కోరిన్స్వెట్ నటించగా ప్రముఖ దర్శకుడు జేమ్స్ గన్ దర్శకత్వం వహించారు. అలాగే జేక్ ది జెయింట్ స్లేయర్ నటుడు నికోలస్ హౌల్ట్ విలన్ గా నటించారు.