వాయిదా పడుతూ వస్తున్న ‘ఒంగోలు గిత్త’ ఆడియో విడుదల వేడుక ఎట్టకేలకు ఖరారైంది. జనవరి 16న సాయంత్రం 7 గంటలకు ఒంగోలు గిత్త ఆడియో విడుదల వేడుక జరగనుంది. అన్నపూర్ణ స్టూడియో లోని సెవెన్ ఎకర్స్ స్టూడియోలో ఈ వేడుక జరగనుంది. ప్రస్తుతం అదే స్టూడియోలో పాట షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సడన్ గా ప్లాన్ చేసారని రామ్ చెప్పుకొచ్చాడు. రామ్ గత చిత్రం ఎందుకంటే ప్రేమంట ఆడియో కూడా ఇక్కడే విడుదల కావడం విశేషం. రామ్ సరసన కృతి ఖర్బంధ నటిస్తున్న ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ఫిబ్రవరి నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.