రామ్, కృతి ఖర్బంధ ప్రధాన పాత్రలలో రానున్న “ఒంగోలు గిత్త” మరికొద్ది వారాల్లో విడుదలకు సిద్దమయ్యింది. ఈ చిత్ర ఆడియో ఈరోజు అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ స్టూడియోలో విడుదల అయ్యింది. భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించారు ఈ చిత్రానికి బాపినీడు సహా నిర్మాత. ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమానికి అలీ,కోన వెంకట్, వనమాలి, భాస్కర్ భట్ల మరియు స్రవంతి రవికిషోర్ హాజరయ్యారు. ఈ చిత్రం గురించి దర్శకుడు భాస్కర్ మాట్లాడుతూ ” ఈ చిత్రం కోసం మా బృందం చాలా కష్టపడి పని చేసింది ఫ్యామిలి ఎంటర్ టైనర్ చిత్రాలు చేసిన తరువాత ఏదయినా కొత్తగా ప్రయత్నించాలని ఈ చిత్రాన్ని చేశాను, రామ్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోయారు” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రామ్ మాట్లాడుతూ “ఈ చిత్ర చిత్రీకరణ మొదలు పెట్టినప్పుడు నేను దేని గురించి ఆలోచించలేదు నా పాత్రలోకి దూరిపోయాను. ఈ చిత్రాన్ని భాస్కర్ మలచిన విధానాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు” అని అన్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించగా మణిశర్మ నేపధ్య సంగీతం అందించారు. వెంకటేష్ సినిమాటోగ్రఫీ అందించారు.