మొన్నటి వరకు తన బ్యాటింగ్ దాటితో స్టేడియంలో ఆడియెన్స్ చేత ఈలలు వేయించిన డేవిడ్ వార్నర్ కరోనా లాక్ డౌన్ టైం లో వరుస డాన్స్ వీడియోలతో అలరిస్తున్నాడు. ఈ స్టార్ బ్యాట్స్ మెన్ డాన్స్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇప్పటికే అల వైకుంఠపురంలో మూవీలోని బుట్ట బొమ్మ, మరియు రాములో రాములో సాంగ్ కి తన భార్యతో కలిసి స్టెప్స్ వేసి అలరించారు వార్నర్. అలాగే పోకిరి సినిమాలో మహేష్ డైలాగ్ చెప్పి మహేష్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చాడు.
తాజాగా ఆయన ప్రభుదేవా ఎవర్ గ్రీన్ ముక్కాల ముక్కాబుల సాంగ్ కి భార్యతో కలిసి డాన్స్ చేశాడు. స్ట్రీట్ డాన్సర్ మూవీ కోసం ముక్కాల ముక్కాబుల సాంగ్ ని రీమిక్స్ చేయగా ఆ పాటకు డేవిడ్ వార్నర్ డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఇక డేవిడ్ వార్నర్ స్పూర్తితో ఇంగ్లాడ్ మాజీ క్రికెటర్ పీటర్సన్ కూడా వరుస డాన్స్ వీడియోలు చేయడం గమనార్హం. ఇండియన్ సాంగ్స్ కి ఈ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ స్టెప్స్ వేయడం వరల్డ్ వైడ్ గా సంచలంగా మారింది.
https://www.instagram.com/p/CASDEZlpBgx/