రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘ఆన్ ది రోడ్’ మూవీ

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘ఆన్ ది రోడ్’ మూవీ

Published on Oct 2, 2025 9:30 AM IST

తెలుగు తెరపై తొలిసారి రోడ్-ట్రిప్ థ్రిల్లర్ రూపంలో ‘ఆన్ ది రోడ్’ అనే వినూత్న చిత్రం రాబోతోంది. లడఖ్ లోయల అందాల మధ్య చిత్రీకరించిన ఈ సినిమాను సూర్య లక్కోజు డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన గతంలో రామ్ గోపాల్ వర్మతో అనేక ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఆర్‌జీవీ స్వయంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్‌ను ఆవిష్కరించడం ఆసక్తిని మరింత పెంచింది.

ఈ చిత్ర కథలో, ఒక యువకుడు రోడ్ ట్రిప్‌లో తన మాజీ ప్రేయసిని అనుకోకుండా కలుసుకుంటాడు. ఆమె తన భర్తతో వెకేషన్‌కు వచ్చిన సమయంలో, యువకుడు ఆమెకు గతాన్ని గుర్తు చేస్తూ తనతో రావాలని ప్రపోజ్ చేస్తాడు. ఈ సంఘటనతో ముగ్గురి మధ్య ఏర్పడే డ్రామా, సస్పెన్స్ ప్రధానాంశాలుగా సాగే ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకోనుందని చిత్ర యూనిట్ తెలిపింది.

SPL పిక్చర్స్ బ్యానర్‌పై సూర్య లక్కోజు, రాజేష్ శర్మ నిర్మించిన ‘ఆన్ ది రోడ్’ చిత్రం అక్టోబర్ 10న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కర్ణ్ శాస్త్రి, స్వాతి మెహ్రా, రాఘవ్ టి, రవి సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవీన్ కుమార్, సుర్‌భిత్ మనోచా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు