మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రమే “పెద్ది”. రామ్ చరణ్ ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు బలంగా కోరుకుంటుండగా ఇప్పుడు వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి హిట్ అయ్యింది. ఇలా ఎట్టకేలకి సినిమా అవైటెడ్ ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి తాలూకా ఫుల్ సాంగ్ వచ్చేసింది.
మరి ఈ సాంగ్ మాత్రం ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచి సినిమాకి మొదటి పాటతోనే బ్లాక్ బస్టర్ వైబ్స్ ని ప్రామిస్ చేస్తుంది అని చెప్పాలి. దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ తో చేసిన ప్లానింగ్ మాత్రం అభిమానులని మరింత క్యాచీగా చెప్పాలంటే పక్కా ఏ గ్రేడ్ సరుకే అని చెప్పాలి. మొత్తం సాంగ్ ఒక రేంజ్ లో ఉంటే దానికి మేకర్స్ తీసుకున్న కేర్ అందించిన విజువల్స్ రామ్ చరణ్ మరో హైలైట్ అని చెప్పి తీరాల్సిందే.
ప్రోమో లోనే అనుకుంటే ఇప్పుడు పాట లోనే బోలెడు హుక్ స్టెప్స్ పెట్టి సోషల్ మీడియాని షేక్ చేసే అదిరే సాంగ్ ని ఇప్పుడు దింపారని చెప్పవచ్చు. డెఫినెట్ గా ఈ సినిమా గట్టి రీచ్ నే సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. రెహమాన్ ఇచ్చిన ఫ్రెష్ ట్యూన్ అందుకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ కొరియోగ్రఫీ అమితంగా వర్క్ అయ్యాయి. మొత్తానికి మాత్రం మరో సిక్సర్ ని పెద్ది గాడు కొట్టేశాడని చెప్పాల్సిందే.


