“ఆదిపురుష్” లో ప్రతినాయకుడు అతనే.!

“ఆదిపురుష్” లో ప్రతినాయకుడు అతనే.!

Published on Sep 3, 2020 7:24 AM IST

ఇది వరకు ప్రభాస్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా తాను నటిస్తున్న సినిమాలకు సంబంచించి అప్డేట్ల ప్రవాహం వస్తుంది అని చెప్పాలి. “బాహుబలి” మరియు “సాహో” సినిమాలకు అయితే ప్రభాస్ అభిమానులు అప్డేట్ అనే పదాన్నే మర్చిపోయారు. అదే విధంగా “రాధే శ్యామ్” కు కూడా జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం సీన్ అలా లేదు. ప్రభాస్ నటిస్తున్న మూడు భారీ ప్రాజెక్టులకు సంబంధించి ఎప్పటికప్పుడు చిత్ర యూనిట్ నుంచే అప్డేట్ వస్తుండడం హాట్ టాపిక్ గా నిలిచింది.

అయితే ఇపుడు ప్రభాస్ నటిస్తున్న భారీ ఇతిహాస చిత్రం “ఆదిపురుష్” చిత్రానికి సంబంధించి ఒక అప్డేట్ రానుంది అని దర్శకుడు ఓం రౌత్ తెలిపాడు. దీనితో అది ఏమిటా అని మొత్తం సినీ ప్రపంచం ఈరోజు ఉదయం కోసం ఎదురు చూసింది. అయితే ఓం రౌత్ చెప్పిన సమయానికే సరిగ్గా 7 గంటల 11 నిమిషాలకు ఆ అప్డేట్ ను రివీల్ చేసారు. “7000 వేల సంవత్సరాల కితం ప్రపంచంలో అత్యంత తెలివైన రాక్షకుడు ఉద్భవించాడు” అని ట్వీట్ చేసారు.

అయితే ఇది మాత్రం ఈ చిత్రంలో రావణ పాత్రను పరిచయం చేయడమే అనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి ఈ చిత్రంలో బాలీవుడ్ కు చెందిన ఒక స్టార్ నటుడు ప్రతినాయకుని పాత్రలో కనిపించనున్నారని బజ్ వినిపించింది. అది కూడా సైఫ్ అలీ ఖాన్ పేరే వినిపించింది. ఇపుడు అతన్ని కూడా ఓంరౌత్ ట్యాగ్ చేసి సైఫ్ ను లంకేశునిగా చూపించనున్నట్టు ఖరారు చేసారు. ఈ భారీ చిత్రాన్ని ఓంరౌత్ 500 కోట్లకు పైగా బడ్జెట్ తో 3డి లో తెరకెక్కించనున్నారు. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను తిరగేస్తుందో చూడాలి.

తాజా వార్తలు