చాలా స్టైలిష్ గా లాంచ్ అయిన ఓం ఆడియో

చాలా స్టైలిష్ గా లాంచ్ అయిన ఓం ఆడియో

Published on May 26, 2013 3:56 AM IST

OM-3D--(13)
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘ఓం సినిమా ఆడియో ఈ రోజు చాలా స్టైలిష్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ‘ఓం’ సినిమాకి సై కార్తీక్ – అచ్చు కలిసి సంగీతం అందించారు. ఈ సినిమాలో కృతి కర్భంద, నిఖీషా పటేల్ కళ్యాణ్ రామ్ సరసన ఆడి పాడారు. 3డిలో తెరకెక్కిన ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ చాలా టైంని, అలాగే భారీ మొత్తాన్ని ఖర్చు చేసారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి హీరో గానే కాకుండా నిర్మాణ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. ఈ సినిమా ఆడియో సిడిని కళ్యాణ్ రామ్ కూతురు లాంచ్ చేసి మొదటి సిడిని దాసరి నారాయణరావుకి అందజేసింది. ఈ వేడుకకి హరికృష్ణ, సిరివెన్నెల సేతారాంశాస్త్రి తదితరులు హాజరయ్యారు.

తాజా వార్తలు