నారా రోహిత్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న ‘ఒక్కడినే’ చిత్ర షూటింగ్ ప్రస్తుతం షరా వేగంగా పూర్తి చేసుకుంటుంది. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ఇప్పటి వరకు 60% వరకు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర ఆఖరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో మొదలైంది. నారా రోహిత్, నిత్యా మీనన్, సాయి కుమార్ మరియు ఇతర నటీ నటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. గతంలో జెనీలియా ముఖ్య పాత్రలో ‘కథ’ అనే సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీనివాస్ రాగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సీవీ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నేపధ్య గాయకుడూ కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.