నైజాం గడ్డపై ఓజీ సునామీ.. ప్రీమియర్స్‌తోనే రికార్డులు గల్లంతు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఓజీ’ మరికొద్ది నిమిషాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పవన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రీమియర్ షోలు వేస్తున్నారు.

ఒక్క నైజాం ఏరియాలోనే ఈ చిత్రానికి 366 కి పైగా ప్రీమియర్ షోలు పడటం విశేషం. ఇది నైజాం ఏరియాలోనే ఆల్ టైమ్ రికార్డు అని మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ షోస్ అన్ని కూడా ఫుల్ అయిపోయినట్లు వారు పేర్కొన్నారు.

దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి తుఫాన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి, తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version