‘ఓజి’ మేకర్స్ ఈ విషయంలో లైట్ తీసుకున్నారా..!

‘ఓజి’ మేకర్స్ ఈ విషయంలో లైట్ తీసుకున్నారా..!

Published on Sep 3, 2025 9:00 AM IST

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘ఓజి’. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ మరింత హైప్ పెంచుతూ వస్తుంది. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఇంకొక్క విషయంలో మాత్రం ఓజి మేకర్స్ స్లో గానే ఉన్నారని చెప్పక తప్పదు.

ఇప్పుడు వరకు ఓజి విషయంలో కనిపిస్తున్న హైప్ మొత్తం తెలుగు వరకే ఉందని చెప్పాలి. మేకర్స్ కూడా తెలుగు కంటెంట్ మాత్రమే ముందు విడుదల చేస్తున్నారు. హిందీ, తమిళ్ లో కూడా ఏకకాలంలో విడుదల చేస్తే బాగుండేది. ఓజి రెండో సాంగ్ సువ్వి సువ్వి వచ్చి 6 రోజులు అయ్యింది.

అయినప్పటికీ ఇంకా ఈ సాంగ్ తాలూకా హిందీ, తమిళ్ వెర్షన్ లు రాలేదు. ఇక నిన్న ఇమ్రాన్ హష్మి టీజర్ గ్లింప్స్ కూడా హిందీలో కూడా వదిలి ఉంటే నార్త్ ఆడియెన్స్ లో మరింత రీచ్ దక్కి ఉండేది. ఇలాంటి విషయాలు మేకర్స్ ఎందుకో లైట్ తీసుకున్నారనే భావన ఆల్రెడీ చాలా మందిలో మొదలైంది. మరి దీనిని సరిచేసుకుంటారో లేదో చూడాలి.

తాజా వార్తలు