మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ ని రెడి చేసి భారత ఇతిహాసాలకి కొత్తదనాన్ని జోడించి సూపర్ హీరో సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలా తన లైనప్ లో ఉన్న చిత్రాల్లో మొదటి లేడీ సూపర్ హీరోయిన్ చిత్రమే “మహా కాళీ”. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడే మంచి బజ్ ని జెనరేట్ చేసింది.
ఇక ఇప్పుడు ఓ బిగ్ అప్డేట్ రివీల్ చేసేందుకు ఓ పవర్ఫుల్ పోస్టర్ తో ప్రశాంత్ వర్మ సాలిడ్ అప్డేట్ అందించాడు. ఈ అక్టోబర్ 30న ఉదయం 10 గంటల 8 నిమిషాలకి ఆ అప్డేట్ ఏంటి అనేది రివీల్ చేస్తున్నట్లు తెలిపాడు. మరి అదేంటి అనేది వేచి చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తుండగా ఆర్ కె డి స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
#Mahakali ????@RKDStudios #RKDuggal @PujaKolluru #AkshayeKhanna#RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/CALH4jdCqV
— Prasanth Varma (@PrasanthVarma) October 29, 2025
