సెప్టెంబర్ 8న ‘రామయ్యా వస్తావయ్యా’ ఆడియో ?

సెప్టెంబర్ 8న ‘రామయ్యా వస్తావయ్యా’ ఆడియో ?

Published on Aug 27, 2013 6:50 PM IST

Ramaiya-Vastavaiya
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’. ఈ సినిమా ఆడియోని సెప్టెంబర్ 8న విడుదల చేయాలనుకుంటున్నారని తాజా సమాచారం. ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట ఈ ఆడియో అనుకున్న సమయానికి విడుదల అవుతుందా?

ప్రస్తుతం ఈ సినిమా నిర్వహణ టీం స్పెయిన్ లో ఉంది. ఈ సినిమాకు సంబందించిన రెండు పాటలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఎన్.టి.ఆర్, సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హసన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. హరీష్ శంకర్ తీస్తున్న ఈ సినిమాలో మాస్ మసాలా ఎంటర్టైనింగ్ ఎక్కువగా ఉంటాయని అభిమానులు బావిస్తున్నారు.

తాజా వార్తలు