యాక్షన్ చేస్తున్న ఎన్.టి.ఆర్

యాక్షన్ చేస్తున్న ఎన్.టి.ఆర్

Published on Jun 5, 2013 8:21 AM IST

NTR

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాకి సంబందించిన యాక్షన్ సీక్వెన్స్ లను ప్రస్తుతం షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ లను ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ కంపోజ్ చేస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అదిరిపోయే డైలాగ్స్ తో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. ఎన్.టి.ఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ సెకండ్ హీరోయిన్ గా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా వార్తలు