యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘బాద్షా’ టీజర్ నిన్న విడుదలైన విషయం తెలిసిందే. 27 సెకండ్లు గల ఈ టీజర్ కి ఫ్యాన్స్ నుండే కాకుండా సిని అభిమానుల నుండి కూడా మంచి స్పందన లభిస్తుంది. ఎన్టీఆర్ కొత్త స్టైల్, తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్లో స్పెషల్ అట్రాక్షన్ కాగా అందరినీ ఆకర్షిస్తున్న మరో అంశం ఏంటంటే ఎన్టీఆర్ ఈ టీజర్లో చెప్పిన డైలాగ్ స్టైల్. ఎన్టీఆర్ గతంలో మాస్ స్టైల్ మాత్రమే ఫాలో అయ్యే వాడు ఈ సినిమాలో క్లాస్ టచ్ తో డైలాగ్ డెలివరీ మార్చాడు. బాద్షా చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల పుట్టిన రోజు సందర్భంగా ఈ టీజర్ ని నిన్న విడుదల చేసారు. బాద్షా చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరబాద్లోని నోవాటెల్ హోటల్లో జరుగుతుంది. కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.
బాద్షా టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి