దమ్ము ఆడియో విడుదల తేదీ ఖరారు?

దమ్ము ఆడియో విడుదల తేదీ ఖరారు?

Published on Feb 9, 2012 10:08 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ దమ్ము చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఈ చిత్ర ఆడియో ఉగాది రోజు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అధికారికంగా దీని గురించి ఎటువంటి సమాచారం లేనప్పటికీ విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ తేదీకి ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో సినిమాకి హైలెట్ అవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో త్రిషా మరియు కార్తీక హీరోయిన్లుగా నటిస్తున్నారు. భానుప్రియ ఎన్టీఆర్ తల్లిగా నటిస్తుండగా సుమన్ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. బోయపాటి ఈ చిత్రాన్ని పవర్ఫుల్ గా తెరకెక్కిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై అలెగ్జాన్డర్ వల్లభ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు