ఆంద్ర ప్రదేశ్ అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకి అన్నగారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారి 90వ జయంతి ఈ రోజు. ఈ తెలుగు సినిమా లేజండ్రీ యాక్టర్, పొలిటీషియన్ అయిన ఎన్.టి.ఆర్ గారు కృష్ణా జిల్లాకి చెందిన ఓ వ్యవసాయ కుటుంబంలో 1923 మే 28వ తేదీన జన్మించారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కెరీర్ సాగించి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మోస్ట్ పాపులర్ యాక్టర్ గా పేరు సంపాదించారు.
ఇటీవలే జరిగిన ‘ 100 సంవత్సరాల ఇండియన్ సినిమా’ వేడుకల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లబించింది. ఎన్.టి.ఆర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పటికీ ఆణిముత్యాల్లా నిలిచిపోయే సినిమాల్లో నటించారు. ఉదాహరణకి ‘పాతాల భైరవి’, ‘మాయ బజార్’, ‘మిస్సమ్మ’, ‘గుండమ్మ కథ’, ‘రాముడు – భీముడు’, ‘దాన వీర శూర కర్ణ’ మొదలైన ఎన్నో అద్భుతమైన సినిమాలను మనకు అందించారు.
పౌరాణిక పాత్రలు చేయడంలో ఎన్.టి.ఆర్ గారు పెట్టింది పేరు. ఆయన రాముడు, కృష్ణుడు వేషం వేస్తే నిజంగా రాముడు, కృష్ణుడు ఇలాగే ఉంటారేమో అని అనుకోని వాళ్ళు ఉండరు. అలాగే రావణ, దుర్యోధన లాంటి నెగటివ్ పాత్రలు చేయడంలో కూడా ఆయన సిద్దహస్తుడే.
90 వ జయంతి సందర్భంగా ఎన్.టి.ఆర్ గారికి 123తెలుగు.కామ్ సెల్యూట్ చేస్తోంది.