యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – కందిరీగ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ని చిత్రీకరించారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నటించబోయే ప్రముఖ నటులు కూడా ఈ షూటింగ్ లో పాల్గొననున్నారు.
ఎన్.టి.ఆర్ – సమంత జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రణిత సెకండ్ హీరోయిన్ గా కనిపించనుంది. బెల్లం కొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫుల్ కామెడీతో మాస్ ఎంటర్టైనర్ గా ఉంటుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి ‘రభస’ అనేది వర్కింగ్ టైటిల్ అనుకున్నారు, కానీ చివరికి అది మారే అవకాశం ఉంది. ఈ సినిమా వచ్చే సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.