బృందావనం భామతో ఎన్టీఆర్ రొమాన్స్

బృందావనం భామతో ఎన్టీఆర్ రొమాన్స్

Published on Nov 20, 2012 8:26 AM IST


బృందావనం సినిమాలో ఎన్టీఆర్, సమంత కాంబినేషన్ గుర్తుంది కదా. ఆ బాల గోపాలాన్ని అలరించిన ఈ సినిమాలో వీరి జంట ఎందరినో ఆకట్టుకుంది. వీరిద్దరు మరో సినిమా చేస్తే బావుండు అని చాలా మంది అనుకున్నారు కూడా. ఎట్టకేలకు ఇప్పుడు వారిద్దరు కలిసి మరోసారి రొమాన్స్ చేయబోతున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా ఇటీవలే ఒక సినిమా ముహూర్తం జరుపుకుంది. ఈ సినిమాలో సమంత హీరొయిన్ అని అధికారికంగా కన్ఫర్మ్ చేసారు. హరీష్ శంకర్ ఈ సినిమాని లవ్ స్టొరీగా మలచబోతున్నారని సమాచారం. అయితే ఎన్టీఅర్ ట్రేడ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండబోతుంది. హరీష్ శంకర్ ఇటీవలే గబ్బర్ సింగ్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మాంచి ఊపు మీదున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు