త్రివిక్రమ్ మూవీలో ఎన్టీఆర్ రోల్ అలా ఉంటుందట..!

త్రివిక్రమ్ మూవీలో ఎన్టీఆర్ రోల్ అలా ఉంటుందట..!

Published on Mar 8, 2020 3:12 PM IST

డైరెక్టర్ త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో మూవీతో సూపర్ ఫార్మ్ లోకి వచ్చాడు. దీనితో ఆయన ఎన్టీఆర్ తో చేస్తున్న తదుపరి చిత్రంపై ఫ్యాన్స్ లో విపరీతమైన ఆసక్తినెలకొంది. ఎన్టీఆర్ తన 30వ చిత్రం త్రివిక్రమ్ తో చేస్తుండగా మే నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. అల వైకుంఠపురంలో బన్నీ ని మధ్య తరగతి యువకుడిగా చూపించి అటు హాస్యం మరియు ఎమోషన్స్ తోపాటు అదిరిపోయే యాక్షన్ పంచిన త్రివిక్రమ్ మరి ఎన్టీఆర్ ని ఎలా చూపించనున్నాడు అనే ఆసక్తి నెలకొని ఉంది.

కాగా త్రివిక్రమ్ తన తదుపరి చిత్రంలో ఎన్టీఆర్ రోల్ కూడా చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దనున్నాడట. ఎన్టీఆర్ రోల్ కి ఇంకా మంచి హ్యూమర్ అలాగే యాక్షన్ జోడించి సరికొత్తగా రూపొందిస్తాడట. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ చాలా సీరియస్ రోల్ అయిన కొమరం భీమ్ పాత్ర చేస్తున్నాడు. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ తరువాత వచ్చే తన మూవీలో కొంచెం రొమాంటిక్ తో కూడిన హ్యూమరస్ గా ఆయన పాత్రను చూపించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడని సమాచారం.

తాజా వార్తలు