ఎన్టీఆర్, నీల్.. టైటిల్ కూడా ఆరోజే!?

ఎన్టీఆర్, నీల్.. టైటిల్ కూడా ఆరోజే!?

Published on Apr 30, 2025 8:08 AM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు చేస్తున్న అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో 31వ సినిమాగా ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్టు పై ఎనలేని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రం నుంచి మేకర్స్ రీసెంట్ గానే రెండు సాలిడ్ అప్డేట్స్ కూడా ఇచ్చేసారు. సినిమా తాలూకా కొత్త రిలీజ్ డేట్ అలానే గ్లింప్స్ రిలీజ్ లని ఖరారు చేశారు.

అయితే సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ని లాక్ చేసినట్టుగా ఎప్పుడు నుంచో రూమర్స్ ఉన్నాయి. మరి ఈ టైటిల్ సహా గ్లింప్స్ ఇంకా క్రేజీ మాస్ పోస్టర్స్ అన్నీ కూడా తారక్ పుట్టినరోజు కానుక గానే బయటకి రానున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. మరి టైటిల్ డ్రాగన్ అనే ఉంటుందా లేక మరో టైటిల్ పెడతారా అనేది వేచి చూడాల్సిందే. ఇక గ్లింప్స్ అయితే మే 19 లేదా 20న రావచ్చు. ఇక సినిమా వచ్చే ఏడాది జూన్ 25కి మేకర్స్ లాక్ చేశారు.

తాజా వార్తలు