బాద్షా కోసం స్పెయిన్ వెళ్ళిన ఎన్.టి.ఆర్

baadshah

యంగ్ టైగర్ ఎన్.టి.అర్ నటిస్తున్న ‘బాద్షా’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. మూడు పాటలు మినహా ఈ సినిమాలోముఖ్యమైన భాగం పూర్తయ్యింది, ఈ పాటలను ఇటలీ, స్విట్జర్లాండ్, బ్యాంకాక్, హైదరాబాద్లలో షూట్ చేయనున్నారు. ప్రసుతం ఎన్.టి.అర్ ఒక పాట కోసం స్పెయిన్ వెళ్ళడు, మరో పాటను స్విట్జర్లాండ్ లో షూట్ చేస్తారు. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది, నవదీప్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఎన్.టి.అర్ కెరిర్లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా కానుంది, అలాగే ఈ సినిమా రిలీజ్ కి ముందే మంచి బిజినెస్ జరుగుతోంది. ఎన్.టి.అర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో అందరి అంచనాలు ఆకాశాన్ని తాకనున్నాయి. ఈ సినిమాలో ఎన్.టి.అర్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్ లలో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదలలో ఎటువంటి మార్పు ఉండదని అనుకున్న సమయానికే విడుదల చేస్తామని బండ్ల గణేష్ మరోసారి చెప్పారు. ఈ సినిమాకు ఎస్.ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియోని మార్చ్ 10న విడుదల చేయనున్నారు,అలాగే సినిమాని ఏప్రిల్ 5న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version