ఎన్టీఆర్ క్లాప్, వినాయక్ డైరెక్షన్

ఎన్టీఆర్ క్లాప్, వినాయక్ డైరెక్షన్

Published on Dec 26, 2012 11:42 AM IST

Ksuma-rajeev-creations

క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన రాజీవ్ కనకాల నిర్మాతగా మారాడు. కే. సుమ రాజీవ్ క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి, ఈ బ్యానర్లో మొదటి ప్రోగ్రాంగా ‘లక్కు కిక్కు’ నిర్మిస్తున్నాడు. ఈ ప్రోగ్రాంకి టీవీ వ్యాఖ్యాతగా ఎన్నో ప్రోగ్రామ్స్ కి వ్యవహరించిన ఆయన సతీమణి సుమ వ్యాఖ్యాతగా చేయనుంది. జీ తెలుగు ఛానల్లో ఈ ప్రోగ్రాం ప్రసారం కానుంది. కే. సుమ రాజీవ్ క్రియేషన్స్ బ్యానర్ ఓపెనింగ్ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. ఈ వేడుకకి ఎన్టీఆర్, వివి వినాయక్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, శ్రీకాంత్ మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ కనకాల ప్రాణ స్నేహితుడు ఎన్టీఆర్ ఈ ప్రోగ్రాం మొదటి షాట్ క్లాప్ కొట్టగా వివి వినాయక్ డైరెక్ట్ చేసాడు. ఎన్టీఆర్ మాట్లాడుతూ సుమ, రాజీవ్ ఏ పని చేసినా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ లక్కు కిక్కు ప్రోగ్రాం కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నాడు.

తాజా వార్తలు