ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో తీరిక లేకుండా గడుపుతున్న ఎన్టీఆర్ హోళీ సెలవు తీసుకున్నాడు. నేడు భార్య లక్ష్మీ ప్రణతి మరియు ఇద్దరు కుమారులతో కలిసి హోళీ ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే తన అభిమానులకు హోళీ శోభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన హోళీ సెలెబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటో పంచుకున్నారు.
రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరో స్టార్ హీరో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా భారీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2021 జనవరి 8న విడుదల కానుంది. అలియా భట్, అజయ్ దేవ్ గణ్ వంటి బాలీవుడ్ స్టార్స్ సైతం ఆర్ ఆర్ ఆర్ లో కీలక రోల్స్ చేస్తున్నారు.